మోదీ సైతం నన్ను అభినందించారు: ట్రంప్

ABN , First Publish Date - 2020-09-14T01:47:09+05:30 IST

అమెరికాలో అధ్యక్ష పదవి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు దూకుడు పెంచారు. కరో

మోదీ సైతం నన్ను అభినందించారు: ట్రంప్

వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష పదవి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు దూకుడు పెంచారు. కరోనాను కట్టడి చేయడంలో ట్రంప్ విఫలమయ్యారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. భారతీయ అమెరికన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీని వాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులతో మాట్లాడిన ఆయన.. కరోనా విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉంటే.. భారత్ రెండో స్థానంలో కొనసాగుతోందని పునరుద్ఘాటించారు. అమెరికాలో నిర్వహిస్తున్న కొవిడ్ టెస్టులపట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అంతేకాకుండా ఈ విషయంలో నరేంద్రమోదీ సైతం తనను అభినందించారని ట్రంప్ తెలిపారు. కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు 64లక్షల మంది కొవిడ్ బారినపడగా.. 1.90లక్షల మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-09-14T01:47:09+05:30 IST