గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు
ABN , First Publish Date - 2020-12-02T02:28:31+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పౌరులందరికీ ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్ధాపక
లండన్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పౌరులందరికీ ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యమైన ఆయుధమన్నారు. చదువుకున్న వారు అత్యధికంగా ఉండే హైదరాబాద్ లాంటి అంతర్జాతీయ నగరంలో ఓటింగ్ శాతం తగ్గడం బాధ కలిగించిందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పని చేసిన స్థానిక, ఎన్నారై టీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేక కృతఙ్ఞతలు చెప్పారు. సోషల్ మీడియా బాధ్యులు వై.సతీష్ రెడ్డి, క్రిశాంక్, జగన్ తదితరులు క్రియాశీలకంగా పని చేశారని తెలిపారు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.