కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం పట్ల ప్రవాసుల్లో హర్షం

ABN , First Publish Date - 2020-03-18T20:05:20+05:30 IST

కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం పట్ల ప్రవాసుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం పట్ల ప్రవాసుల్లో హర్షం

లండన్: కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం పట్ల ప్రవాసుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ప్రజా నాయకురాలైన కవితకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశమిచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఎన్నారై టీఆర్ఎస్ యూకే సలహా మండలి వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేశారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆ తరువాత ఎంపీగా రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి సేవలందించారని, అటు జాగృతి అధ్యక్షురాలిగా తెలంగాణ ఆడబిడ్డగా మన సంస్కృతి సంప్రదాయాలని విశ్వవ్యాప్తం చేశారని ఆయన కొనియాడారు. ఇటువంటి గొప్ప నాయకురాలు అనునిత్యం ప్రజల్లో ఉండాలనే సంకల్పంతో కేసీఆర్‌ వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో అటు క్షేత్రస్థాయిలోనే కాకుండా ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలల్లో, ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపారని ఈ సందర్భంగా ప్రవాసులందరి పక్షాన కృతఙ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంతా బాధ్యతగా ఓటేసి కవితను గెలిపించాలని చంద్రశేఖర్ గౌడ్ కోరారు.  

Updated Date - 2020-03-18T20:05:20+05:30 IST