భారీ శబ్దాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్కాట్లాండ్ జనం!

ABN , First Publish Date - 2020-12-07T02:44:14+05:30 IST

స్కాట్లాండ్ రాజధాని ప్రజలు భారీ శబ్దాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాఢ నిద్రలో ఉన్న వారంతా తీ

భారీ శబ్దాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్కాట్లాండ్ జనం!

న్యూఢిల్లీ: స్కాట్లాండ్ రాజధాని ప్రజలు భారీ శబ్దాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాఢ నిద్రలో ఉన్న వారంతా తీవ్ర భయాందోళనలకు గురైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా భారతదేశంలో ఉరుములు మెరుములో కూడిన భారీ వర్షాలు పడుతుంటాయి. అదే విధంగా ప్రస్తుతం స్కాట్లాండ్‌లో ఉరుములు మెరుపులతో కూడిన హిమపాతం భారీగా కురుస్తోంది. ఈ క్రమంలోనే స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్‌లో శుక్రవారం రోజు ఉదయం ఉరుములు, మెరుపులతో హిమపాతం కురిసింది. అయితే ఈ శబ్దాలు అసాధారణంగా ఉండటంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయభ్రాంతులకు గురైన ప్రజలు ఆ శబ్దాలను పెలుళ్లుగా భావించి.. పోలీసులకు ఫోన్‌లు చేశారు. తీరా విషయం తెలుసుకుని శాంతించారు. కాగా.. అసాధారణ శబ్దాలతో రాజధాని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురైన విషయాన్ని నగర పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 
Read more