క‌రోనాతో యూఏఈలో ముగ్గురు భార‌తీయులు మృతి !

ABN , First Publish Date - 2020-05-13T14:37:04+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ వ‌ల్ల యూఏఈలో మ‌రో ముగ్గురు భార‌తీయులు మృతి చెందారు.

క‌రోనాతో యూఏఈలో ముగ్గురు భార‌తీయులు మృతి !

యూఏఈ: మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ వ‌ల్ల యూఏఈలో మ‌రో ముగ్గురు భార‌తీయులు మృతి చెందారు. మృతుల‌ను కేర‌ళ రాష్ట్రం అల‌ప్పుజ‌కు చెందిన షాజీ చెల్లప్పన్(54), త్రిస్సూర్‌ వాసి అశోక్ కుమార్‌, తిరువ‌నంత‌పురంకు చెందిన సుశీల‌న్‌(60)గా గుర్తించారు. షాజీ చెల్లప్పన్ కొన్ని రోజుల క్రితం క‌రోనా సోకడంతో అబుధాబిలోని ఆస్ప‌త్రిలో చేరాడు. అక్క‌డ ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో చ‌నిపోయాడు. దుబాయిలో షాజీ వ‌ర్క్‌షాప్ ఉద్యోగిగా ప‌ని చేస్తున్నాడు. షాజీకి భార్య‌ విజిత, పిల్లలు ధనంజయ్, మహీంద్రన్ ఉన్నారు. దుబాయిలోనే అత‌ని అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. కాగా, గ‌డిచిన 24 గంట‌ల్లోనే గ‌ల్ఫ్ రీజియ‌న్‌లో ఏడుగురు కేర‌ళ వాసులు కొవిడ్‌-19తో మృత్యువాత ప‌డ్డారు. అలాగే గ‌ల్ఫ్ దేశాల్లో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించిన మొత్తం కేర‌ళ వాసులు 68 మంది అయ్యారు.    ‌

Read more