అమెరికాలో ఆగంతకుడి కాల్పులు.. ముగ్గురు మృతి!
ABN , First Publish Date - 2020-12-27T17:27:16+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి.

ఇల్లినాయిస్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌లో ఉన్న డాన్ కార్టర్ లేన్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన రాక్‌ఫోర్డ్ సిటీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, స్థానికులేవరు ఘటన జరిగిన ప్రాంతం చుట్టుపక్కలకు రావొద్దని పోలీస్ చీఫ్ దాన్ ఓషియా మీడియా ద్వారా ప్రజలను కోరారు. గాయపడిన ముగ్గురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఓషియా వెల్లడించారు.