ఇండియా నుంచి సింగపూర్ వెళ్లిన ముగ్గురికి కరోనా పాజిటివ్!
ABN , First Publish Date - 2020-08-01T23:18:27+05:30 IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. సింగపూర్‌లోనూ మహమ్మారి విజృంభిస్తోంది. శనివారం రోజు సింగపూర్‌లో కొత్తగా 307 కరోనా కేసు

సింగపూర్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. సింగపూర్‌లోనూ మహమ్మారి విజృంభిస్తోంది. శనివారం రోజు సింగపూర్‌లో కొత్తగా 307 కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇందులో అత్యధిక కేసులు.. విదేశీ కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల్లోనే నమోదైనట్లు అధికారులు వివరించారు. ఇదిలా ఉంటే.. గత నెల 3, 19 తేదీల్లో భారత్ నుంచి సింగపూర్ వెళ్లిన ముగ్గురు.. కరోనా బారినపడ్డట్లు అధికారులు వెల్లడించారు. క్వారెంటైన్ కేంద్రాల్లో ఉన్న ఈ ముగ్గురికీ.. వైరస్ లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపారు. వాళ్ల పరీక్ష ఫలితాలు శుక్రవారం రోజు వచ్చినట్లు తెలిపిన అధికారులు.. అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. కరోనా బారినపడిన ముగ్గురిలో 13 ఏళ్ల బాబు, 6 సంవత్సరాల అమ్మాయి, 28ఏళ్ల మహిళ ఉన్నట్లు అధికారులు స్ఫష్టం చేశారు. ఇదిలా ఉంటే.. సింగపూర్‌లో కరోనా బారినపడిన వారి సంఖ్య 52,512కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 46,491 మంది మహమ్మారిని జయించి, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. కాగా.. సింగపూర్‌లో కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 27కు చేరింది.