విషాదాన్ని మిగిల్చిన విహారయాత్ర.. మెల్‌బోర్న్‌లో ముగ్గురు భారతీయులు మృతి

ABN , First Publish Date - 2020-03-12T20:30:10+05:30 IST

పంజాబ్‌లోని పటియాలా జిల్లా సమానా ప్రాంతానికి చెందిన ముగ్గురు పంజాబీలు మెల్‌బోర్న్‌లో జరిగి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

విషాదాన్ని మిగిల్చిన విహారయాత్ర.. మెల్‌బోర్న్‌లో ముగ్గురు భారతీయులు మృతి

పటియాలా: పంజాబ్‌లోని పటియాలా జిల్లా సమానా ప్రాంతానికి చెందిన ముగ్గురు పంజాబీలు మెల్‌బోర్న్‌లో జరిగి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విహారయాత్రకు వెళ్లి వస్తున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న వాహనంపై చెట్టు విరిగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఈష్ప్రీత్ సింగ్(16), స్వర్ణజీత్ సింగ్(34), అమన్దీప్ కౌర్(32)గా గుర్తించారు. 13 ఏళ్ల క్రితం పంజాబ్ నుంచి మెల్‌బోర్న్‌ వెళ్లిన స్వర్ణజీత్ సింగ్ అక్కడే స్థిరపడ్డాడు. ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ తన భార్య అమన్దీప్ కౌర్, కుమారుడు సెహాజ్(4)తో  కలిసి ఉంటున్నాడు. స్వర్ణజీత్ సింగ్ దగ్గరి బంధువైన గుర్మీత్ కౌర్ ఫిబ్రవరి 16న తన కుమారుడు ఈష్ప్రీత్ సింగ్‌తో కలిసి మెల్‌బోర్న్ వెల్లింది.


దీంతో స్వర్ణజీత్ సింగ్ దంపతులు ఈ తల్లి కొడుకులను తీసుకుని మార్చి 8న మెల్‌బోర్న్‌లోని హిల్ స్టేషన్‌కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ కొంతసేపు సరదాగా గడిపిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనంపై ప్రమాదవశాత్తు ఓ చెట్టు విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఈష్ప్రీత్ సింగ్(16), స్వర్ణజీత్ సింగ్(34), అమన్దీప్ కౌర్(32) అక్కడికక్కడే మృతిచెందారు. గుర్మీత్ కౌర్, సెహాజ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ మెల్‌బోర్న్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మృతుల స్వస్థలమైన సమానాలో విషాదం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని మృతుల బంధువులు కోరుతున్నారు.   

Updated Date - 2020-03-12T20:30:10+05:30 IST