రైతులకు మద్దతుగా బ్రిటన్‌లో భారతీయుల నిరసన!

ABN , First Publish Date - 2020-12-07T21:26:24+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఉద్యమానికి యావత్ దేశం రైతులకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో విదేశాల్లో ని

రైతులకు మద్దతుగా బ్రిటన్‌లో భారతీయుల నిరసన!

లండన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఉద్యమానికి యావత్ దేశం రైతులకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా రైతులకు మద్దతు తెలుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలోని ప్రవాసులు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. తాజాగా బ్రిటన్‌లోని భారతీయులు రైతులకు మద్దతు తెలుపుతూ ఆదివారం రోజు నిరసనలు చేపట్టారు. స్కిక్కు కమ్యూనిటీకి చెందిన వేలాది మంది భారతీయులు సెంట్రల్ లండన్‌లో ర్యాలీలు తీశారు. 



ఆల్డ్‌విచ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ కార్యాలయం ముందు రైతులకు మద్దతుగా నిరసనలు తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని.. రైతులకు న్యాయం చేయాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. కాగా.. ఇండియన్ హైకమిషన్ అధికార ప్రతినిధి దీనిపై స్పందించారు. స్థానిక అధికారులతో సమన్వయం అవుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా లండన్‌లో జరిగిన ఈ నిరసనల వెనక భారత వ్యతిరేక వేర్పాటు వాదుల హస్తం ఉందని పేర్కొన్నారు. సొంత ఎజెండాతోనే భారత వ్యతిరేక వేర్పాటు వాదులు ఈ నిరసనలకు నాయకత్వ వహించారని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. ఈ నిరసనల్లో పాల్గొన్న చాలా మంది కొవిడ్ నిబంధనలు ఉల్లఘించారు. కనీసం మాస్కులు కూడా ధరించలేదు. ఈ నేపథ్యంలో కొంత మంది నిరసనకారులను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2020-12-07T21:26:24+05:30 IST