గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2020-12-13T22:22:54+05:30 IST

గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చే యాలని కోరుతూ ప్రవాస హక్కులు, సంక్షేమ వేదిక వ్యవస్థా పకుడు కోటపాటి నర్సింహంనాయుడు శనివారం ఎమ్మె

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి

హైదరాబాద్: గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చే యాలని కోరుతూ ప్రవాస హక్కులు, సంక్షేమ వేదిక వ్యవస్థా పకుడు కోటపాటి నర్సింహంనాయుడు శనివారం ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వే ల్పూర్‌లో ఎంఆర్‌డబ్ల్యుఎఫ్‌ వ్యవస్థాపకుడు కోటపాటి నరసిం హంనాయుడు అధ్యక్షతన గల్ఫ్‌ కార్మికులతో సమావేశం నిర్వ హించి మాట్లాడారు. గల్ఫ్‌కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్‌తో కూడిన ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. గల్ఫ్‌లో చ నిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, విదేశాలల్లో వివిధ కారణాలతో ఉండిపోయిన వారిని స్వదేశానికి రప్పించి ఉపాధి, వైద్య, విద్య సదుపాయాలు కల్పించాలన్నారు.


రాష్ట్రా నికి చెందిన సుమారు 15లక్షల మంది గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారని చెప్పారు. కేరళ రాష్ట్రంలో ఏర్పాటు చేసి న మాదిరిగా నాన్‌ రెసిడెన్షియస్‌ తెలంగాణ నైట్‌ వెల్ఫేర్‌ ఆక్టి వ్‌ ద్వారా గల్ఫ్‌ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రతీ ఏడాది రూ.500కోట్ల బడ్జెట్‌ కేటాయించాలన్నారు. గల్ఫ్‌ బాధితులకు సబ్సిడీతో రుణాలు ఇచ్చి ఉపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్‌డబ్ల్యుఎఫ్‌ దుబా యి శాఖ అధ్యక్షుడు ఏముల రమేష్‌, లిగల్‌ అడ్వైజర్‌ ఉరె బాలయ్య, యూఏఈ అధ్యక్షుడు మహిపాల్‌, పూజిర, జగదీశ్వర్‌, జిల్లా ఆర్టీఏ కమి టీ సభ్యుడు రేగుల్ల రాములు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-13T22:22:54+05:30 IST