మీడియా కథనాలను తోసిపుచ్చిన ఆస్ట్రాజెనెకా..!

ABN , First Publish Date - 2020-09-12T13:31:13+05:30 IST

తాము కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలను ఆపేందు కు దారితీసిన కారణాన్ని ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. ఓ మహిళా వలంటీర్‌కు తీవ్రమైన నాడీ (న్యూరోలా

మీడియా కథనాలను తోసిపుచ్చిన ఆస్ట్రాజెనెకా..!

లండన్‌, సెప్టెంబరు 11: తాము కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలను ఆపేందు కు దారితీసిన కారణాన్ని ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. ఓ మహిళా వలంటీర్‌కు తీవ్రమైన నాడీ (న్యూరోలాజికల్‌)సమస్య తలెత్తినందు వల్లే ట్రయల్స్‌కు బ్రేక్‌ వేశామని ఆ కంపెనీ అధికార ప్రతినిధి మాథ్యూ కెంట్‌ స్పష్టం చేశారు. మెద డు, వెన్నెముకలలోని మైలీన్‌ తొడుగుకు వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకే ‘ట్రాన్స్‌వర్స్‌ మైఎలిటిస్‌’ సమస్యతో ఆమె బాధపడుతోందంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చారు. ‘‘అది ట్రాన్స్‌వర్స్‌ మైఎలిటిసో.. కాదో మాకు తెలియదు.. పూర్తి వివరాలు తెలియాలంటే మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉం టుంది’’ అని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-09-12T13:31:13+05:30 IST