అమెరికాలో తెలుగు టెకీ మృతి !
ABN , First Publish Date - 2020-03-13T17:27:52+05:30 IST
అమెరికాలోని హూస్టన్‌లో అనారోగ్యంతో ఓ తెలుగు టెకీ మృతిచెందాడు.

కామారెడ్డి: అమెరికాలోని హ్యూస్టన్‌లో అనారోగ్యంతో ఓ తెలుగు టెకీ మృతిచెందాడు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన బూర్ల అరుణ్ కుమార్(41) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్వాసకోశ సమస్యతో బుధవారం మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 16 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన అరుణ్ హ్యూస్టన్‌లో స్థిరపడ్డాడు. అయితే, గత కొన్ని రోజులుగా అతను శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ అనారోగ్య సమస్యతోనే అరుణ్ బుధవారం చనిపోయాడు. అరుణ్‌కు భార్య రజినీ, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అతని తండ్రి భిక్నూర్ మండలంలో వ్యాపారవేత్త. అరుణ్ మృతితో అతని స్వస్థలంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు అరుణ్ మృతదేహాన్ని అమెరికా నుంచి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.