కరోనా తెచ్చిన కష్టం.. ఇటలీలో వందలాది తెలుగు విద్యార్థుల ఇక్కట్లు..

ABN , First Publish Date - 2020-03-12T14:08:13+05:30 IST

కరోనా కట్టడి కోసం ఆరోగ్య దిగ్బంధం అమలవుతున్న నేపథ్యంలో వందలాది మంది తెలుగు విద్యార్థులు ఇటలీలో చిక్కుకుపోయారు.

కరోనా తెచ్చిన కష్టం.. ఇటలీలో వందలాది తెలుగు విద్యార్థుల ఇక్కట్లు..

రోమ్: కరోనా కట్టడి కోసం ఆరోగ్య దిగ్బంధం అమలవుతున్న నేపథ్యంలో వందలాది మంది తెలుగు విద్యార్థులు ఇటలీలో చిక్కుకుపోయారు. ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉన్నారనే ధ్రువీకరణ లభిస్తేనే స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని.. అయితే ఆ ధ్రువీకరణ ఇచ్చేందుకు ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘బొలొగ్న వర్సిటీలో 30 మందికిపైగా తెలంగాణ, ఏపీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వారికి కరోనా లక్షణాలు లేవు. అయినా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను ఆస్పత్రులు మంజూరు చేయడం లేదు. దీంతో మేం ఇళ్లు దాటే పరిస్థితి లేకుండా పోయింది’ అని సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన గెల్ల బద్రీనాథ్‌ తెలిపారు. ఇక పడోవా వర్సిటీలో 50 మందికిపైగా భారత విద్యార్థులు చదువుతున్నారు. వారిలో అత్యధికులు విజయవాడ పరిసర ప్రాంతాల వారేనని తెలుస్తోంది. కొడొగ్నో నగరంలో మరో 100 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారని అక్కడ ఎరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన శ్రీచరణ్‌ తేజ తెలిపాడు.

Updated Date - 2020-03-12T14:08:13+05:30 IST