మమ్మల్ని భారత్‌కు రప్పించండి ప్లీజ్..
ABN , First Publish Date - 2020-03-13T14:00:12+05:30 IST
రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 60-70 మంది విద్యార్థులం 24 గంటల నుంచి బిక్కుబిక్కుమంటున్నాం.

రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 60-70 మంది విద్యార్థులం 24 గంటల నుంచి బిక్కుబిక్కుమంటున్నాం. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్ సమర్పిస్తేనే విమానంలోకి అనుమతిస్తామని అధికారులు అంటున్నారు. ఈ సర్టిఫికేట్ ఎవరిస్తారో ఇక్కడి భారత ఎంబసీ అధికారులకు కూడా తెలియడం లేదు. మాకు ఇక్కడ భోజనంతో పాటు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇటలీ అంతా బంద్ కావడంతో బయట కూడా ఆహారం అందుబాటులో లేదు. మాకు మెడికల్ సర్టిఫికేట్ లేకుండానే స్వదేశానికి వచ్చేందుకు భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. భారత్‌లో ఎలాంటి పరీక్షలకైనా మేం సిద్ధంగా ఉన్నాం.
- రోమ్ విమానాశ్రయం నుంచి తెలంగాణ విద్యార్థులు