మేమేం చేయలేం.. మోదీకే చెప్పుకోండి

ABN , First Publish Date - 2020-06-07T02:20:28+05:30 IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1200 మంది విద్యార్థులు చి

మేమేం చేయలేం.. మోదీకే చెప్పుకోండి

భారత్‌కు పంపాలంటూ కిర్గిస్థాన్‌లో  తెలుగు విద్యార్థుల ఆందోళన 

భారత ఎంబసీ నిర్లక్ష్యపు సమాధానం


పటాన్‌చెరు రూరల్‌, జూన్‌ 5 : కరోనా సంక్షోభం నేపథ్యంలో కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1200 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. ‘వందే భారత్‌’ మిషన్‌లో భాగంగా తమను భారత్‌ పంపాలంటూ చాలామంది బిష్కెక్‌లోని భారత రాయబార కార్యాలయానికి మెయిల్స్‌, ఫోన్ల ద్వారా విన్నవించారు. అయినా అధికారులు స్పందించకపోగా.. విద్యార్థులకు అవకాశం లేదంటూ కొంతమందిని మాత్రమే ఇండియాకు తరలించారు.


దీంతో శుక్రవారం విద్యార్థులంతా మాకుమ్మడిగా భారత ఎంబసీకి చేరుకొని అధికారులకు తమ పరిస్థితిని వివరించారు. ఈక్రమంలో ఓ అధికారి ‘‘మేమేం చేయలేం.. ప్రధాని మోదీకే చెప్పుకోండి’’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంబసీ అధికారుల తీరును కొందరు విద్యార్థులు వీడియోలో చిత్రీకరించే ప్రయత్నం చేయడంతో వారి ఫోన్లను లాక్కునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఎంబసీ కార్యాలయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు భారత ప్రధాని తమను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. 

Updated Date - 2020-06-07T02:20:28+05:30 IST