కువైట్‌లో గుండెపోటుతో తెలుగు ఎన్నారై మృతి !

ABN , First Publish Date - 2020-07-19T16:09:58+05:30 IST

కువైట్‌లో ఓ తెలుగు ఎన్నారై గుండెపోటుతో మృతి చెందాడు. టైల‌ర్‌గా ప‌నిచేస్తూ గ‌త 15 ఏళ్లుగా కువైట్‌లోనే ఉన్న లింగాల ఈశ్వ‌ర్ రెడ్డి(48) ఈ నెల 13న గుండెపోటుతో చ‌నిపోయాడు.

కువైట్‌లో గుండెపోటుతో తెలుగు ఎన్నారై మృతి !

కువైట్ సిటీ: కువైట్‌లో ఓ తెలుగు ఎన్నారై గుండెపోటుతో మృతి చెందాడు. టైల‌ర్‌గా ప‌నిచేస్తూ గ‌త 15 ఏళ్లుగా కువైట్‌లోనే ఉన్న లింగాల ఈశ్వ‌ర్ రెడ్డి(48) ఈ నెల 13న గుండెపోటుతో చ‌నిపోయాడు. మృతుడిది ఏపీలోని వైఎస్సార్ జిల్లా పెన‌గ‌లూరు మండలం చ‌క్రంపేట గ్రామం. కాగా, ఈశ్వ‌ర్ రెడ్డి మృతి విష‌యాన్ని వైఎస్ఆర్‌పీ కువైట్ కో క‌న్వీన‌ర్ గోవిందు నాగ‌రాజు ద్వారా తెలుసుకున్న ముమ్మ‌డి బాల్‌రెడ్డి వెంట‌నే స్పందించి మృతదేహాన్ని స్వ‌దేశానికి పంపించే ఏర్పాట్లు చేశారు. కువైట్‌లోని ఇండియన్ ఎంబ‌సీ ద్వారా ఇమిగ్రేష‌న్ ప‌నులు, పేప‌ర్ వ‌ర్క్‌ పూర్తి చేసి మృతదేహాన్ని చెన్నైకి పంపించారు. అక్క‌డి నుంచి మృతదేహాన్ని ఏపీఎన్ఆర్‌టీఎస్ వారు ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ ద్వారా స్వ‌స్థ‌లం చ‌క్రంపేటకు త‌ర‌లించ‌నున్నారు. కాగా, మృతుడికి భార్య‌, కుమారుడు ఉన్నారు. రెండేళ్ల క్రితం వ‌ర‌కు భార్య‌, కొడుకు కూడా కువైట్‌లోనే ఉన్నారు. ఈశ్వ‌ర్ రెడ్డి మృతితో వారు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు.        

Updated Date - 2020-07-19T16:09:58+05:30 IST