దుబాయ్‌లో బూర్గుపల్లి వాసి మృతి

ABN , First Publish Date - 2020-03-13T13:56:07+05:30 IST

బతుకుదెరువు కోసం దుబాయ్‌కు వెళ్లిన మెదక్‌ జిల్లా హవేళిఘణపూర్‌ మండలం బూర్గుపల్లికి చెందిన మారేల్లి ప్రేమయ్య(40) ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడి మృతి చెందాడు.

దుబాయ్‌లో బూర్గుపల్లి వాసి మృతి

హవేళిఘణపూర్‌, మార్చి 12: బతుకుదెరువు కోసం  దుబాయ్‌కు వెళ్లిన మెదక్‌ జిల్లా హవేళిఘణపూర్‌ మండలం బూర్గుపల్లికి చెందిన మారేల్లి ప్రేమయ్య(40) ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడి మృతి చెందాడు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం.. భవనంపై బట్టలు ఆరవేస్తూ కాలుజారి కిందపడి మృతి చెందాడు. ప్రేమయ్య మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు  కోరుతున్నారు.

Updated Date - 2020-03-13T13:56:07+05:30 IST