పట్టెడన్నం కోసం గంటల తరబడి క్యూలైన్ లో.. కువైత్‌లో ప్రవాసుల పాట్లు!

ABN , First Publish Date - 2020-06-16T16:03:10+05:30 IST

కువైత్‌ వెళ్లిన వారి పరిస్థితి రోజురోజుకు మరింత దయనీయంగా మారుతోంది. ప్రస్తుతం కువైత్‌లో కరోనా లాక్‌డౌన్‌ కఠినతరంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.

పట్టెడన్నం కోసం గంటల తరబడి క్యూలైన్ లో.. కువైత్‌లో ప్రవాసుల పాట్లు!

రాజంపేట(కడప): కువైత్‌ వెళ్లిన వారి పరిస్థితి రోజురోజుకు మరింత దయనీయంగా మారుతోంది. ప్రస్తుతం కువైత్‌లో కరోనా లాక్‌డౌన్‌ కఠినతరంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పట్టెడన్నం కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి న దుస్థితి. కువైత్‌లో తెలుగువారితో పాటు ఇతర దేశస్థులు లక్షలాది మంది ఉన్నారు. అక్కడి ప్రభుత్వం అనేక చోట్ల వీరికి భోజన ఏర్పాట్లు చేస్తోంది. భోజనం కోసం ఒక్కసారిగా వేలాది మంది బారులుతీరడంతో తోపులాటలు జరుగుతున్నాయి. ఈ విషయమై ఏపీఎన్‌ఆర్‌టీ కడప జిల్లావాసులైన ముమ్మడి బాలిరెడ్డి, ఎం.వి.నరసారెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రస్తుతం లాక్‌డౌన్‌ దృష్ట్యా  కువైత్‌లో మనవారు చాలామంది నానా అగచాట్లు పడుతన్నారని తెలిపారు.

Updated Date - 2020-06-16T16:03:10+05:30 IST