ఇటలీలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థి.. ఆందోళనలో కుటుంబం
ABN , First Publish Date - 2020-03-23T14:24:00+05:30 IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు దీని బారినపడిన వారి సంఖ్య 3లక్షలు దాటింది. దాదాపు 13,500 మందిని పొట్టన పెట్టుకుంది. చైనాలో జన్మించి

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు దీని బారినపడిన వారి సంఖ్య 3లక్షలు దాటింది. దాదాపు 13,500 మందిని పొట్టన పెట్టుకుంది. చైనాలో జన్మించిన కొవిడ్-19 చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు పాకింది. అయితే చైనాలో దీని ప్రభావం తగ్గినప్పటికీ.. ఇటలీలో మాత్రం విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజే 651 మంది చనిపోవడంతో.. ఇటలీలో మృతుల సంఖ్య 5,500కు చేరింది.
ఈ నేపథ్యంలో ఇటలీలో చిక్కుకున్న తన కొడుకును హైదరాబాద్‌కు రప్పించాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా వేడుకున్నారు. వివరాల్లోకి వెళితే..ఇటలీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తన కొడుకు అన్షుమాన్ సజ్జను హైదరాబాద్‌కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని మురళీ కృష్ణ సజ్జ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌ను కోరారు. అంతేకాకుండా అన్షుమాన్ సజ్జా ఇటలీలో ఉంటున్న ప్రదేశం వివరాలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
