'ఎన్నారైస్ ఫర్ అమరావతి'కి తెలంగాణ ఎన్నారై రూ.15 లక్షల విరాళం

ABN , First Publish Date - 2020-12-03T20:21:20+05:30 IST

ఏపీలో అమరావతి రాజధాని రైతుల ఉద్యమానికి ఏపీ, తెలంగాణలతో పాటు దేశవ్యాప్తంగా తెలుగు వారి మద్దతిస్తున్న సంగతి తెలిసిందే.

'ఎన్నారైస్ ఫర్ అమరావతి'కి తెలంగాణ ఎన్నారై రూ.15 లక్షల విరాళం

పీలో అమరావతి రాజధాని రైతుల ఉద్యమానికి ఏపీ, తెలంగాణలతో పాటు దేశవ్యాప్తంగా తెలుగు వారి మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా రాజధాని కోసం  భూములు త్యాగం చేసిన రైతులకు అండగా మేమున్నామంటూ ఎన్నారైలు, ఎన్నారై సంఘాలు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నాయి. జయరాం కోమటి ఆధ్యర్యంలో చేపట్టిన విరాళాల సేకరణకు అనూహ్య స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే '#NRISForAMARAVATI'కి స్వయంగా తెలంగాణ ఎన్నారై రవి కుమార్ మందలపు రూ.15 లక్షల భారీ విరాళమిచ్చి తన ఉదారతను చాటుకున్నారు.


కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చి స్థిరపడ్డ రవి కుమార్.. ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. స్వతహాగా తెలంగాణకు చెందిన రైతుబిడ్డ అయిన రవి కుమార్... ఏపీతో ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ పొరుగు తెలుగు రాష్ట్రంలో రైతుల కోసం తన వంతు సాయం అందించారు. అమెరికాలోని తెలుగువారికి కూడా చాలా కాలంగా తన వంతు సహాయ సహకారాలందిస్తున్నారు. జన్మభూమి, తానా నిర్వహించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తమకు అండగా నిలిచిన రవి కుమార్‌కు అమరావతి రాజధాని రైతులు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-12-03T20:21:20+05:30 IST