కువైట్‌లో ఘనంగా రామ్మోహన్ నాయుడి జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2020-12-19T20:57:08+05:30 IST

కువైట్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ అభిమాన నాయకుడు, తెలుగుదేశం నేత, శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కుదరవల్లి సు

కువైట్‌లో ఘనంగా రామ్మోహన్ నాయుడి జన్మదిన వేడుకలు

కువైట్ సిటీ: కువైట్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ అభిమాన నాయకుడు, తెలుగుదేశం నేత, శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడి జన్మదిన వేడుకలను శుక్రవారం  ఘనంగా నిర్వహించారు. కుదరవల్లి సుధాకరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో టీడీపీ కార్యకర్తలు కేక్‌ కట్ చేసి, రామ్మోహన్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పీఆర్వోలు మద్దిన ఈశ్వర్ నాయుడు, బాలరెడ్డయ్య, వెల్ఫేర్ కోఆర్డినేటర్ నాగార్జున, ప్రోగ్రాం కన్వీర్ ప్రసాద్, మైనార్టీ అధ్యక్షుడు చాన్బాషా, అధికార ప్రతినిధి విజయ్, అనిశెట్టి ప్రసాద్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Read more