రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కార్మికుడు.. ఎలా అంటే!

ABN , First Publish Date - 2020-06-26T07:11:45+05:30 IST

అప్పటి వరకు గనుల్లో కార్మికుడిగా పని చేసిన వ్యక్తి, రాత్రికి రాత్రే కోటిశ్వరుడైన ఘటన టాంజానియాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. టాంజానియాలో

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కార్మికుడు.. ఎలా అంటే!

టాంజానియా: అప్పటి వరకు గనుల్లో కార్మికుడిగా పని చేసిన వ్యక్తి, రాత్రికి రాత్రే కోటిశ్వరుడైన ఘటన టాంజానియాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. టాంజానియాలోని గనుల్లో పని చేసే లైజర్ అనే వ్యక్తికి.. రెండు పెద్ద రత్నాలు దొరికాయి. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో.. అతని వద్ద నుంచి ఆ రత్నాలను 7.74 బిలియన్ టాంజానియన్ షిల్లింగ్స్‌(దాదాపు రూ.25కోట్ల)కు కొనుగోలు చేసింది. ఆ రత్నాలలో ఒకటి 9.27 కేజీల బరువు ఉండగా.. మరొకటి 5.10 కిలోల బరువు ఉన్నట్లు అధికారులు తేల్చారు. లైజర్‌కు డబ్బులకు సంబంధించిన చెక్కును అందించిన సందర్భంగా ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడారు. మిరేరానీలో గనులు తవ్వడం మొదలు పెట్టిన దగ్గర నుంచి అంత పెద్ద రత్నాలు దొరకడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. 


Updated Date - 2020-06-26T07:11:45+05:30 IST