'తానా' ప్రపంచ స్థాయి కవితల పోటీలు

ABN , First Publish Date - 2020-06-03T14:08:41+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం "తానా ప్రపంచ సాహిత్య వేదిక" ఆధ్వర్యంలో ప్రపంచ పితృ దినోత్సవం (జూన్ 21, 2020) సందర్భంగా " ఘనుడు నాన్న- త్యాగధనుడు నాన్న" అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో తెలుగు కవితల పోటీలు నిర్వహిస్తున్నామని...

'తానా' ప్రపంచ స్థాయి కవితల పోటీలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం "తానా ప్రపంచ సాహిత్య వేదిక" ఆధ్వర్యంలో ప్రపంచ పితృ దినోత్సవం (జూన్ 21, 2020) సందర్భంగా " ఘనుడు నాన్న- త్యాగధనుడు నాన్న" అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో తెలుగు కవితల పోటీలు నిర్వహిస్తున్నామని, భారతదేశం నుండి చిగురుమళ్ళ శ్రీనివాస్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారని తానా అధ్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఒక సంయుక్త పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

 

పోటీల నియమాలు:

* కవితలు 20 పంక్తులకు మించకుండా ఒక పేజీలో ఉండాలి

* కవిత తో పాటు మీ ఫొటో కూడా పంపాలి

* కవితలు పంపాల్సిన వాట్సాప్ నెంబరు: 91210-81595

* ఈమెయిల్: prapanchasaahityavedika@tana.org 

* కవితలు చేరవలసిన గడువు: జూన్ 15, 2020

* ఒకరు ఒక కవిత నే పంపాలి 

* కవితతో పాటు మీ వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, మీ చిరునామా మరియు ఈ కవిత మీ స్వీయ రచనే అని ధ్రువీకరిస్తూ సంతకం చేసి పంపాలి.

 

పోటీలలో విజేతలకు 

ప్రథమ బ‌హుమ‌తి- రూ. 10,116; ద్వితీయ బ‌హుమ‌తి- రూ. 7,116; తృతీయ బ‌హుమ‌తి- రూ. 5,116ల నగదు ఇవ్వ‌బడుతుంది. ఎంపికైన మరిన్ని కవితలకు ప్రోత్సాహక బహుమతులు అందజేయబడును. బహుమతులు గెలుచుకున్న వారికి యోగ్యతా పత్రాలు అందజేయడంతో పాటు వారి కవితలను తానా పత్రికలో ప్రచురించడం జరుగుతుంది. ఇతర వివరాలకు www.tana.orgను సందర్శించండి.

Updated Date - 2020-06-03T14:08:41+05:30 IST