అమెరికాలోని నిరుపేదలకు తానా సహాయం

ABN , First Publish Date - 2020-11-21T14:21:33+05:30 IST

విడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కబళించిందో, ఎంతమందిని రోడ్డునపాలు చేసిందో అందరికీ తెలిసిందే. అమెరికాలో

అమెరికాలోని నిరుపేదలకు తానా సహాయం

  • 150 ప్రాంతాల్లో తానా ఫుడ్‌ డ్రైవ్‌
  • లక్ష డాలర్ల విలువైన ఆహారపదార్ధాల పంపిణీ

డాలస్: కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కబళించిందో, ఎంతమందిని రోడ్డునపాలు చేసిందో అందరికీ తెలిసిందే. అమెరికాలో ఈ కోవిడ్‌ వల్ల ఎంతోమంది నిరుపేదలు ఇబ్బందులపాలయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని కమ్యూనిటీకి తనవంతుగా ఏదైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుకు వచ్చింది. తానా కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ మల్లివేమన ఆధ్వర్యంలో ఆహారాన్ని పంపిణీ చేసేందుకు 150 ప్రాంతాల్లో ఫుడ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఎంతోమంది నిరుపేదలు తిండికోసం కష్టాలు పడుతున్నారని, అటువంటి వారిని ఆదుకోవడానికే తానా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మల్లి వేమన చెప్పారు. అన్ని దానాలలో అన్నదానం గొప్పదని పెద్దలు చెబుతుంటారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా 1,00,000 డాలర్ల విలువైన ఆహారపదార్ధాలను పంపిణీ చేయనున్నామని, 150 ప్రాంతాల్లో ఈ సహాయం చేయనున్నట్లు  చెప్పారు. తానా తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్‌ సహాయ కార్యక్రమాలను చేసిందని, ఎంతోమందికి అన్నదానం చేసిందని, అమెరికాలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తానా పెద్దలకు, ప్రెసిడెంట్‌ జయ్‌ తాళ్ళూరి, మాజీ అధ్యక్షులు సతీష్‌ వేమన, కార్యదర్శి రవి పొట్లూరి, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ అంజయ్య చౌదరి లావు, తానా నేషనల్‌ కేర్స్‌ చైర్‌ జోగేశ్వరరావు పెద్దిబోయినకు మల్లివేమన ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-11-21T14:21:33+05:30 IST