పర్వతాలపై చిక్కుకున్న ఆవు.. హెలికాప్టర్‌ను రంగంలోకి దించిన రైతు!

ABN , First Publish Date - 2020-08-20T06:23:06+05:30 IST

ఓ రైతు.. తాను పెంచుకుంటున్న ఆవును రక్షించుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

పర్వతాలపై చిక్కుకున్న ఆవు.. హెలికాప్టర్‌ను రంగంలోకి దించిన రైతు!

స్విట్జర్‌లాండ్: ఓ రైతు.. తాను పెంచుకుంటున్న ఆవును రక్షించుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. స్విట్జర్‌లాండ్‌కు చెందిన ఓ రైతుకు కొన్ని ఆవులున్నాయి. అందులోని ఓ ఆవు.. ఆల్ఫ్స్‌ పర్వతాలపై చిక్కుకుపోయింది. గాయపడి, నడవలేని స్థితిలో ఉన్న ఆ  ఆవును ఎలాగైన రక్షించాలని సదరు రైతు నిర్ణయించకున్నాడు. దానికి హెలికాప్టర్ ఒక్కటే మార్గం అనుకున్నాడు. ఈ క్రమంలో ఓ హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసి.. పర్వతాలపై చిక్కుకుపోయిన ఆవును క్షేమంగా కిందకు తీసుకొచ్చాడు. ఆల్ఫ్స్ పర్వతాలపై నుంచి ఆవును హెలికాప్టర్ కిందకి దించుతున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ వీడియోను చూసి స్పందిస్తున్న నెటిజన్లు.. రైతును ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు. 


Read more