గల్ఫ్ కార్మికుల సమస్యలపై కేంద్రానికి నోటీసులు
ABN , First Publish Date - 2020-10-07T09:22:15+05:30 IST
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల సమస్యల పరిష్కారం, ఏ

- తెలంగాణ, ఏపీ సహా 12 రాష్ట్రాలు, సీబీఐకి కూడా
న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల సమస్యల పరిష్కారం, ఏజెంట్ల మోసాల విషయంలో కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. సమస్యల పరిష్కారంతో పాటు ఏజెంట్ల మోసాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ గల్ఫ్ తెలంగాణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి.బసంత్‌రెడ్డి పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
గల్ఫ్‌లో భారత కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని బెంచ్‌కు పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్ తెలిపారు. ‘‘ఈ కేసులు ఎలా విచారించగలం? గల్ఫ్ దేశాల చట్టాలు వేరు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించగలం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భారత రాయబార కార్యాలయాల ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని న్యాయవాది వాదించారు. దాంతో ప్రతివాదులుగా ఉన్న కేంద్రం.. తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాలకు, సీబీఐకు సుప్రీం నోటీసులు జారీ చేసింది.