రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సూడాన్ మహిళ మృతి!

ABN , First Publish Date - 2020-07-05T23:01:34+05:30 IST

సూడాన్ దేశానికి చెందిన 62ఏళ్ల వృద్ధురాలు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సూడాన్ మహిళ మృతి!

హైదరాబాద్: సూడాన్ దేశానికి చెందిన 62ఏళ్ల వృద్ధురాలు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..సూడాన్‌కు చెందిన ఓ 62ఏళ్ల మహిళ.. గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుండటంతో.. ఆమె తన స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి సూడాన్‌కు బయల్దేరే విమానంలో స్వదేశానికి వెళ్లడానికి ఆదివారం రోజు ఉదయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో విమానం ఎక్కడానికి వెళ్తూ.. బోర్డింగ్ గేటు వద్ద ఆమె అకస్మాత్తుగా కుప్పకూలారు. విమానాశ్రయం సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా.. ఆమె మరణించడానికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు.


Updated Date - 2020-07-05T23:01:34+05:30 IST