గర్భవతులకు వ్యాక్సిన్‌ మరింత అవసరం

ABN , First Publish Date - 2020-12-28T13:07:11+05:30 IST

గర్భవతులకు కరోనా వ్యా క్సిన్‌ ఇవ్వాల్సిన ఆవశ్యకత మరింత ఉందని ఓ అధ్యయనం తేల్చింది. దీనికి కారణం.. ముందు ఊహిం

గర్భవతులకు వ్యాక్సిన్‌ మరింత అవసరం

బోస్టన్‌, డిసెంబరు 27: గర్భవతులకు కరోనా వ్యా క్సిన్‌ ఇవ్వాల్సిన ఆవశ్యకత మరింత ఉందని ఓ అధ్యయనం తేల్చింది. దీనికి కారణం.. ముందు ఊహించినంతగా తల్లి నుంచి గర్భస్థ శిశువుకు ప్రతినిరోధకాలు వెళ్లకపోవడమేనని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. ఫ్లూ, దగ్గు వంటి వాటిని అడ్డుకునే ప్రతినిరోధకాలు తల్లి మావి(ప్లసెంటా) ద్వారా బిడ్డకు వెళ్తాయి. ఇలాగే.. కరోనా ప్రతినిరోధకాలు కూడా వెళ్తున్నాయి. కానీ, మావిలో అవి మార్పు చెందుతున్నాయి. ఆ ప్రతి నిరోధకాలను కార్బోహైడ్రేట్‌ కణసమూహం మార్చేస్తోంది. మిగతావాటి వేగాన్నీ తగ్గిస్తోంది. ఇది గర్భంలో 7-9 నెల మధ్య జరుగుతోంది. తల్లిలో కరోనా ప్రతినిరోధకాల సంఖ్య పెరగడానికి, శిశువుకు అవి చేరడానికి ఇది కొంత దోహద పడుతోందని అనుకుంటున్నామన్నారు.


Updated Date - 2020-12-28T13:07:11+05:30 IST