ఆపరేషన్ సముద్ర సేతు: ఇరాన్‌కు చేరుకున్న ఐఎన్ఎస్ జలాశ్వా

ABN , First Publish Date - 2020-06-26T00:06:22+05:30 IST

వందే భారత్ మిషన్ పేరిట విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను

ఆపరేషన్ సముద్ర సేతు: ఇరాన్‌కు చేరుకున్న ఐఎన్ఎస్ జలాశ్వా

టెహ్రన్: వందే భారత్ మిషన్ పేరిట విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం భారత్‌కు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. కేవలం విమానాల ద్వారానే కాకుండా యుద్దనౌకల ద్వారా కూడా విదేశాల్లోని భారతీయులను కేంద్రం తీసుకొస్తోంది. దీనికి ఆపరేషన్ సముద్రసేతు అని నామకరణం కూడా చేసింది. కాగా.. బుధవారం యుద్దనౌక ఐఎన్ఎస్ జలాశ్వా ఇరాన్‌లోని పోర్ట్ ఆఫ్ బాండార్ అబ్బాస్‌కు చేరింది. అక్కడ చిక్కుకున్న భారతీయులంతా ఈ యుద్దనౌక ద్వారా స్వదేశానికి రానున్నారు. సముద్రసేతు ఆపరేషన్ మే 8న ప్రారంభం కాగా.. ఇప్పటికే ఐఎన్ఎస్ జలాశ్వా, మాగార్ యుద్దనౌకలు శ్రీలంక, మాల్దీవుల నుంచి 2,874 మందిని భారత్‌కు తీసుకొచ్చింది. మరోపక్క జూన్ 11న ఐఎన్ఎస్ శార్దూల్ యుద్దనౌక ఇరాన్ నుంచి 233 మంది భారతీయులను భారత్‌కు తీసుకురాగా.. జూన్ 23న ఐఎన్ఎస్ ఐరావత్ యుద్దనౌక ద్వారా మాల్దీవుల్లో చిక్కుకున్న 198 మంది భారతీయులు తమ మాతృభూమికి చేరుకున్నారు. ఇప్పటివరకు వందే భారత్ మిషన్ ద్వారా దాదాపు లక్షా 25 వేల మందిని భారత్‌కు తీసుకొచ్చినట్టు విమానయానశాఖ మంత్రి హర్దీప్ పురి సింగ్ మంగళవారం వెల్లడించారు. 

Updated Date - 2020-06-26T00:06:22+05:30 IST