ఇంగ్లాండ్‌లో పని చేస్తున్న ఇండియన్ డాక్టర్‌కు అరుదైన గౌరవం!

ABN , First Publish Date - 2020-07-10T23:09:47+05:30 IST

ప్రాణాలను పణంగాపెట్టి మహమ్మారితో పోరాడుతున్న ఇండియన్ డాక్టర్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ డాక్టర్ పేరు ముద్రించి ఉన్న జెర్సీని ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ధరించాడు. అంతేకాకుండా అదే జెర్సీతో స్టోక్స్..

ఇంగ్లాండ్‌లో పని చేస్తున్న ఇండియన్ డాక్టర్‌కు అరుదైన గౌరవం!

సౌతాంప్టన్: ప్రాణాలను పణంగాపెట్టి మహమ్మారితో పోరాడుతున్న ఇండియన్ డాక్టర్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ డాక్టర్ పేరు ముద్రించి ఉన్న జెర్సీని ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ధరించాడు. అంతేకాకుండా అదే జెర్సీతో స్టోక్స్.. గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో మహమ్మారితో ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ సంఘీభావం ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఇండియన్ డాక్టర్ వికాస్ కుమార్ పేరుతో కూడిన జెర్సీని ధరించి గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేశాడు. దీనిపై డాక్టర్ వికాస్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకే కాకుండా ప్రతిఒక్క డాక్టర్‌కు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తనకు క్రికెట్ అంటే ఇష్టమని, కాలేజీలో క్రికెట్ ఆడినట్లు వికాస్ కుమార్ వెల్లడించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు మెడిసిన్ చదివినట్లు వివరించారు. వికాస్ కుమార్ వ్యాఖ్యలపై బెన్ స్టోక్స్ స్పందించాడు. విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్నందుకు వికాస్ కుమార్‌కు స్టోక్స్ కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాకుండా వికాస్ కుమార్ క్రికెట్‌లో మళ్లీ ప్రతిభ చూపాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా.. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన వికాస్ కుమార్.. 2019లో ఇంగ్లాండ్‌కు వెళ్లి, అక్కడ ఓ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సౌంతప్టన్‌లో ఇంగ్లాండ్, విండీస్ మధ్య టెస్ట్ సీరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2020-07-10T23:09:47+05:30 IST