స్పైస్ జెట్ కీల‌క నిర్ణ‌యం.. విదేశాల్లో చిక్కుకున్న భార‌త ప్ర‌వాసుల కోసం..

ABN , First Publish Date - 2020-07-03T18:45:20+05:30 IST

క‌రోనా లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకున్న భార‌త ప్ర‌వాసుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు బడ్జెట్ ఇండియన్ ఎయిర్ క్యారియర్ స్పైస్ జెట్ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

స్పైస్ జెట్ కీల‌క నిర్ణ‌యం.. విదేశాల్లో చిక్కుకున్న భార‌త ప్ర‌వాసుల కోసం..

ఢిల్లీ: క‌రోనా లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకున్న భార‌త ప్ర‌వాసుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు బడ్జెట్ ఇండియన్ ఎయిర్ క్యారియర్ స్పైస్ జెట్ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొత్తగా మ‌రిన్ని చార్ట‌ర్‌ విమానాలు న‌డప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్రైవ‌సీతో ప్రయాణించడానికి మొత్తం విమానాలను బుక్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తుల కోసం ఈ కొత్త స‌ర్వీసులు ప్రారంభిస్తున్న‌ట్లు స్పైస్ జెట్ యాజ‌మాన్యం పేర్కొంది. ఈ చార్ట‌ర్‌ ఫ్లైట్ సేవలు ఆరుగురు ప్రయాణికుల నుంచి 150 మంది ప్రయాణికుల వరకు కూర్చునే సామర్థ్యంతో వివిధ శ్రేణి విమానాలను కలిగి ఉంటుంద‌ని తెలిపింది. 


ఇదిలా ఉంటే... ఇప్ప‌టికే 200 చార్ట‌ర్ విమాన స‌ర్వీసులు న‌డిపిస్తున్న స్పైస్ జెట్ దాదాపు 30వేల మంది భార‌త ప్ర‌వాసుల‌ను స్వ‌దేశానికి తీసుకొచ్చింది. వీటిలో ప్ర‌ధానంగా గ‌ల్ఫ్ దేశాల నుంచి ఫ్లైట్ స‌ర్వీసులు ఆప‌రేట్ చేసింది. దీనిలో భాగంగా యూఏఈ నుంచి 111 విమానాల్లో సుమారు 20వేల మంది ఎన్నారైల‌ను భార‌త్‌కు త‌ర‌లించింది. మ‌రో 50 విమానాల‌ను సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, లెబనాన్, శ్రీలంక నుంచి న‌డిపించింది. స్పైస్ ‌జెట్ చిన్న 'సెస్నా' వంటి విమానాలను ఏటీఆర్‌కు అందిస్తోంది. అలాగే దేశీయ విమానాల కోసం ఉపయోగించే 'బోయింగ్ 737' కూడా దీని సొంతం. ఇది స్పైస్ జెట్ విమానాలలోనే అతిపెద్దది.

Updated Date - 2020-07-03T18:45:20+05:30 IST