స్పైస్‌జెట్‌, జీఎంఆర్‌ ఎయిర్‌ కార్గో ఒప్పందం

ABN , First Publish Date - 2020-12-25T13:20:58+05:30 IST

హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి దేశ, విదేశాలకు ఆటంకాలు, అడ్డంకులు లేకుండా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను రవాణా చేసేందుకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయుర్‌ కార్గోతో స్పైస్‌జెట్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

స్పైస్‌జెట్‌, జీఎంఆర్‌ ఎయిర్‌ కార్గో ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి దేశ, విదేశాలకు ఆటంకాలు, అడ్డంకులు లేకుండా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను రవాణా చేసేందుకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయుర్‌ కార్గోతో స్పైస్‌జెట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఈ, డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో ఫార్మా, హెటిరో కంపెనీలు.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనుండటంతో వ్యాక్సిన్‌ రవాణాకు హైదరాబాద్‌ విమానాశ్రయం కీలకం కానుంది. ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్‌ రవాణాకు విమానాశ్రయంలో ప్రాధాన్య ప్రాతిపదికన స్పైస్‌జెట్‌కు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో స్థలాన్ని కేటాయిస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ రవాణా కోసం ముదితా ఎక్స్‌ప్రెస్‌ కార్గోతో స్పైస్‌జెట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 

Updated Date - 2020-12-25T13:20:58+05:30 IST