అమెరికా చరిత్రలో పెద్ద సంక్షోభం
ABN , First Publish Date - 2020-04-05T08:21:36+05:30 IST
అమెరికా మొత్తాన్ని చుట్టుముడుతున్న కరోనా వైరస్ దేశ చరిత్రలోనే మునుపెన్న
- 1982 తర్వాత ఉద్యోగాల్లో భారీ కోత
- తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
- ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో.. తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్
(న్యూయార్క్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అమెరికా మొత్తాన్ని చుట్టుముడుతున్న కరోనా వైరస్ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా సంక్షోభాన్ని సృష్టిస్తుందని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తెలిపారు. కొవిడ్-19 కారణంగా అమెరికాలోని 90ు ప్రాంతాల్లో లాక్‌డౌన్ జరుగుతోందని, దీంతో 2 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. 1982లో అమెరికాను కుదిపేసిన ఆర్థిక సంక్షోభం కన్నా ఇది 100ు అధిక సంక్షోభాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. తాను నివసిస్తున్న న్యూయార్క్‌లో ప్రతి గంటకు వందల కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన 30 మంది ప్రముఖులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారని, న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్వోమో సోదరుడికీ కరోనా సోకిందని వెల్లడించారు. 15ు మంది ఫైర్ సిబ్బందికి, 300 మంది పోలీసులకు సైతం కరోనా సోకిందన్నారు.