ఫేస్‌బుక్‌కు రూ. 45 కోట్ల జరిమానా విధించిన దక్షిణ కొరియా ఏజెన్సీ

ABN , First Publish Date - 2020-11-26T08:33:50+05:30 IST

దక్షిణ కొరియాలోని వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే ఏజెన్సీ ఫేస్‌బుక్ సంస్థకు 6.06 మిలియన్ డాలర్ల(రూ. 44. 73 కోట్లు) జరిమానాను విధించింది.

ఫేస్‌బుక్‌కు రూ. 45 కోట్ల జరిమానా విధించిన దక్షిణ కొరియా ఏజెన్సీ

సియోల్: దక్షిణ కొరియాలోని వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే ఏజెన్సీ ఫేస్‌బుక్ సంస్థకు 6.06 మిలియన్ డాలర్ల(రూ. 44. 73 కోట్లు) జరిమానాను విధించింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా ఇతర ఆపరేటర్లకు అందించినందుకు ఏజెన్సీ జరిమానా వేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌ను కూడా కోరింది. దక్షిణ కొరియాలోని 33 లక్షల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా 2012-2018 మధ్య వేరే ఆపరేటర్లకు అందించినట్టు దర్యాప్తులో తేలిందని ఏజెన్సీ తెలిపింది. దక్షిణ కొరియాలో ఫేస్‌బుక్‌కు మొత్తం 1.8 కోట్ల వినియోగదారులు ఉన్నట్టు ఏజెన్సీ పేర్కొంది. ఇక ఈ అంశంపై ఫేస్‌బుక్ సంస్థ స్పందించింది. ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో తాము అధికారులతో సహకరిస్తున్నట్టు ఫేస్‌బుక్‌ అధికారి ఒకరు తెలిపారు. తమ సంస్థపై సదరు ఏజెన్సీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌ను కోరడం విచారకరమని అధికారి అన్నారు.

Updated Date - 2020-11-26T08:33:50+05:30 IST