దక్షిణ కొరియాలో విజృంభిస్తోన్న మహమ్మారి.. ఒకేరోజు అత్యధికంగా..

ABN , First Publish Date - 2020-08-17T04:29:55+05:30 IST

దక్షిణ కొరియాలో మరోమారు మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కొత్తగా 279 కరోనా కేసులు

దక్షిణ కొరియాలో విజృంభిస్తోన్న మహమ్మారి.. ఒకేరోజు అత్యధికంగా..

సియోల్: దక్షిణ కొరియాలో మరోమారు మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కొత్తగా 279 కరోనా కేసులు నమోదైనట్టు కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(కేసీడీసీ) ఆదివారం వెల్లడించింది. మార్చి 8న దక్షిణ కొరియాలో అత్యధికంగా 367 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 15,318కు చేరుకుంది. కేసీడీసీ లెక్కల ప్రకారం.. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు రాజధాని సియోల్‌ నుంచే నమోదయ్యాయి. ఆ తర్వాత 96 కేసులు జియోంగి ప్రావిన్స్ నుంచి బయటపడ్డాయి. దేశంలోని చర్చీల ద్వారానే కరోనా వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తోంది. కాగా.. ప్రపంచదేశాలన్నిటితో పోల్చితే దక్షిణ కొరియా అందరి కంటే ముందుగా మహమ్మారిని నియంత్రించింది. కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయగలిగింది. అంతేకాకుండా కరోనా సోకిన వారి ఫోన్లను ట్రాకింగ్ చేసి వారి దగ్గరికి వేరొకరు చేరకుండా చర్యలు తీసుకోగలిగింది. ఈ విధంగా మహమ్మారిని నియంత్రించినప్పటికి.. తాజాగా దేశంలో మరోమారు కరోనా విజృంభించడం ఆందోళనకు గురిచేస్తోంది.  

Updated Date - 2020-08-17T04:29:55+05:30 IST