సిలికానాంధ్ర మనబడి తరగతులు ప్రారంభం!
ABN , First Publish Date - 2020-09-17T00:10:25+05:30 IST
ఈ విద్యాసంవత్సరానికి (2020-21)గానూ సిలికానాంధ్ర మనబడి తరగతులు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని మనబడి అధ్యక్షుడు, కులపతి రాజు చమర్తి ఓ ప్రకటనలో పేర్కొ

ఈ విద్యాసంవత్సరానికి (2020-21)గానూ సిలికానాంధ్ర మనబడి తరగతులు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని మనబడి అధ్యక్షుడు, కులపతి రాజు చమర్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు manabadi.siliconandhra.org ద్వారా సెప్టెంబర్ 25 తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భాషాసేవయే భావి తరాల సేవ అనే నినాదంతో గత 13 సంవత్సరాలుగా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలోని 35 రాష్ట్రాల్లో 250కిపైగా కేంద్రాల్లో, పదికిపైగా ప్రపంచంలోని ఇతర దేశాల్లో ప్రవాసాంధ్ర పిల్లలకు తెలుగు భాష నేర్పిస్తున్నట్లు వెల్లడించారు. కొవిడ్ నేపథ్యంలో ఇబ్బందులు గురవుతున్నప్పటికీ తరగతులకు హాజరయ్యేందుకు సుమారు 9,500 మంది విద్యార్థులు ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో మొదటి త్రైమాసికం తరగతులకు ఆన్‌లైన్‌లో హాజరుకావాల్సి ఉంటుందన్నారు. కాగా.. గత 13ఏళ్లలో 60,000 మంది చిన్నారులకు తెలుగు నేర్పించినట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే.. మనబడిలో తెలుగు భాష నేర్పించడం మాత్రమే కాకుండా వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలుగుమాట్లాట పోటీలు, బాలానందం రేడియో కార్యక్రమాలు, తెలగుకు పరుగు, పద్యనాటకాలు, నాటకోత్సవాలు, పిల్లల పండుగలు వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వీటి ద్వారా పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు మన కళలపట్ల అవగాహన వస్తుందని చెప్పారు.