సిలికాన్‌ వ్యాలీ వెలవెల.. ఉద్యోగాల కోతకు కంపెనీలు రెడీ

ABN , First Publish Date - 2020-04-15T13:33:36+05:30 IST

అమెరికాలో భారత ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తల అడ్డా అయిన సిలికాన్‌ వ్యాలీ.. కరోనా ధాటికి కళతప్పింది.

సిలికాన్‌ వ్యాలీ వెలవెల.. ఉద్యోగాల కోతకు కంపెనీలు రెడీ

ఉద్యోగాలు, జీతాల కోతకు  సిద్ధమవుతున్న కంపెనీలు 

5-10 శాతం జాబ్స్‌ కట్‌!!

వాషింగ్టన్‌: అమెరికాలో భారత ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తల అడ్డా అయిన సిలికాన్‌ వ్యాలీ.. కరోనా ధాటికి కళతప్పింది. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి టెక్నాలజీ దిగ్గజాలను మినహాయిస్తే, చిన్న, మధ్య స్థాయి స్టార్ట్‌పలకు కరోనా సెగ గట్టిగానే తగిలిందని ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌, ఐటీ పారిశ్రామికవేత్త ఎం రంగస్వామి తెలిపారు. దాంతో ఈ కంపెనీలు ఉద్యోగుల తొలగింపులు లేదంటే వేతనాల్లో కోతలకు సిద్ధమవుతున్నాయన్నారు. కొన్ని కంపెనీలైతే రెండింటినీ అమలు చేస్తున్నాయన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 


వచ్చే నెల నుంచి వ్యాలీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలుండవచ్చు. 5-10 శాతం వరకు  ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు సిలికాన్‌ వ్యాలీలో ఇలాంటి ప్రతికూలతను చూడలేదు. 2008లోనూ ఈ స్థాయి గడ్డు పరిస్థితులు ఎదురుకాలేదు. 


వచ్చే 18-24 నెలల వరకు తమ వద్ద కంపెనీ నిర్వహణకు సరిపడా నిల్వలు ఉండేలా సిలికాన్‌ వ్యాలీ కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి. ఎందుకంటే, నిధుల సేకరణకు ఇది అనువైన కాలం కాదు. ఒకవేళ ఫండింగ్‌ కోసం ప్రయత్నించినా, ఇన్వెస్టర్లు ఈ సమయంలో కంపెనీ మార్కెట్‌ విలువను మరీ తక్కువగా లెక్కగట్టే అవకాశాలున్నాయి.

Updated Date - 2020-04-15T13:33:36+05:30 IST