అమెరికాలో ఓవైపు ఎన్నికలు జరుగుతుంటే.. మరోవైపు..!
ABN , First Publish Date - 2020-11-03T20:58:55+05:30 IST
అమెరికాలో ఓటింగ్ ప్రారంభమైంది. అత్యంత శక్తివంతమైన పదవికి ఎన్నికలు జరుగుతుండటంతో ప్రపంచ దేశాలన్నీ ఫోకస్‌ను అమెరికాపైకి షిఫ్ట్ చేశాయి. ప్రపంచం మొత్తం అమెరికావైపు చూస్తూంటే
వాషింగ్టన్: అమెరికాలో ఓటింగ్ ప్రారంభమైంది. అత్యంత శక్తివంతమైన పదవికి ఎన్నికలు జరుగుతుండటంతో ప్రపంచ దేశాలన్నీ ఫోకస్‌ను అమెరికాపైకి షిఫ్ట్ చేశాయి. ప్రపంచం మొత్తం అమెరికావైపు చూస్తూంటే అమెరికాలోని వ్యాపారస్తులు మాత్రం తమ షాపులను రక్షించుకునే పనిలో తలమునకలై ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. అగ్రరాజ్యాన్ని కరోనా వైరస్ కుదిపేసింది. లక్షలాది మంది ప్రజలు మరణించారు. కోట్లాది మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. ఈ క్రమంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కరోనా మహమ్మారి సృష్టించిన సమస్యల నడుమ అమెరికన్లు తమ అధ్యక్షుడిని ఎన్నికోవలసిన పరిస్థితి వచ్చింది. దీంతో అమెరికా ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి. కాగా.. అధ్యక్ష పదవిని మరోసారి చేజిక్కించుకోవడంపై దృష్టిపెట్టిన ట్రంప్.. దేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి, మరోసారి జాతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారు. డెమొక్రటిక్ నేతలు మాత్రం కరోనా విషయంలో ట్రంప్ ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
(మరిన్ని ఫొటోల కోసం క్లిక్ చేయండి..)
ఈ క్రమంలో అమెరికాలో మంగళవారం రోజు పోలింగ్ ప్రారంభమైంది. కాగా.. ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున అల్లర్లు జరగొచ్చనే పుకార్లు అమెరికాలో షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని వ్యాపారస్తులు తమ వాణిజ్యసముదాయాలను రక్షించుకునే పనిలో పడ్డారు. అమెరికాలోని ప్రధాన నగరాల్లోని వాణిజ్య సముదాయాల యజమానులు తమ షాపులకు ఫ్లైవుడ్‌తో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు. నిరసనకారులు రాళ్లు రువ్వినా ఎటువంటి నష్టం వాటికల్లకుండా కీటికీలను, డోర్‌లను ఫ్లైవుడ్‌తో క్లోజ్ చేయిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
(మరిన్ని ఫొటోల కోసం క్లిక్ చేయండి..)
