కారును సీజ్ చేసిన పోలీసులు.. రోడ్డుపై రచ్చ చేసిన యువతి!

ABN , First Publish Date - 2020-03-14T01:00:44+05:30 IST

ముచ్చటపడి కొనుకున్న కారును పోలీసులు పట్టుకెళ్లిపోతుంటే.. యువతి చేసిన రచ్చ మామూలుగా లేదు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన ఓ యువతి ఇష్టపడి రేం

కారును సీజ్ చేసిన పోలీసులు.. రోడ్డుపై రచ్చ చేసిన యువతి!

లండన్: ముచ్చటపడి కొనుకున్న కారును పోలీసులు పట్టుకెళ్లిపోతుంటే.. యువతి చేసిన రచ్చ మామూలుగా లేదు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన ఓ యువతి ఇష్టపడి రేంజ్‌రోవర్ కారును కొనుగోలు చేసింది. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి కారును కొనుగోలు చేసిన ఆ యువతి.. కారుకు ఇన్సూరెన్స్ చేయించడం మాత్రం మరిచిపోయినట్లుంది. ముచ్చటపడి కొనుకున్న కారులో జామ్ జామ్ అంటూ వెళ్తుంటే.. దారిలో ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. కారుకు సంబంధించిన ఇతర పేపర్లతో పాటు.. ఇన్సూరెన్స్ పేపర్లను కూడా పోలీసులు అడగడంతో ఆ యువతి తెల్లముఖం వేసింది. కారుకు సంబంధించిన ఇన్సూరెన్స్ పేపర్లు లేకపోవడంతో ఆ యువతి కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన యువతి.. కారుపై కూర్చుని హల్‌చల్ చేసింది. అయితే ఆ యువతిని ఏ మాత్రం లెక్కచేయని పోలీసులు.. యువతి కూర్చుని ఉండగానే కారును ట్రక్కులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. లగ్జరీ కారు కొంటే సరిపోదు.. దానికి ఇన్సూరెన్స్ కూడా చేయించాలంటూ యువతిని ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు. 


Updated Date - 2020-03-14T01:00:44+05:30 IST