టర్కీలో ఆస్పత్రిలో పేలుడు.. 9 మంది కరోనా రోగుల మృతి

ABN , First Publish Date - 2020-12-20T10:30:17+05:30 IST

టర్కీలో కరోనా చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో పేలుడు సంభవించి 9 మంది రోగులు మృత్యువాత పడ్డారు. గజియాంటెప్‌ పట్టణంలోని

టర్కీలో ఆస్పత్రిలో పేలుడు.. 9 మంది కరోనా రోగుల మృతి

అంకారా, డిసెంబరు 19: టర్కీలో కరోనా చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో పేలుడు సంభవించి 9 మంది రోగులు మృత్యువాత పడ్డారు. గజియాంటెప్‌ పట్టణంలోని సాంకో యూనివర్సిటీ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సమయంలో ఐసీయూలో 14 మంది రోగులు ఉండగా.. ఐదుగురిని మాత్రం కాపాడగలిగారు. వారిని మరో ఆస్పత్రికి తరలించినట్లు, ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. 


Updated Date - 2020-12-20T10:30:17+05:30 IST