ఆ విషయంలో మొదటి యూరప్ దేశంగా గుర్తింపు పొందిన సెర్బియా!

ABN , First Publish Date - 2020-06-22T01:47:54+05:30 IST

సెర్బియాలో ఆదివారం రోజు పార్లమెంట్‌‌ ఎన్నికలు జరిగాయి. దాదాపు 66 లక్షల మంది సెర్బియన్లు ఈ ఎన్నికల్లో పాల్గొని.. తమకు నచ్చిన వారికి ఓటు వేశారు. కరోనా నేప

ఆ విషయంలో మొదటి యూరప్ దేశంగా గుర్తింపు పొందిన సెర్బియా!

బెల్‌గ్రేడ్: సెర్బియాలో ఆదివారం రోజు పార్లమెంట్‌‌ ఎన్నికలు జరిగాయి. దాదాపు 66 లక్షల మంది సెర్బియన్లు ఈ ఎన్నికల్లో పాల్గొని.. తమకు నచ్చిన వారికి ఓటు వేశారు. కరోనా నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. సానిటైజర్‌ను అందుబాటులో ఉంచడమే కాకుండా.. ప్రజలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. కాగా.. అధికార కన్సర్వేటివ్ పార్టీ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తేసిన తర్వాత.. ఎన్నికలు నిర్వహించిన మొదటి యూరప్ దేశంగా సెర్బియా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే.. సెర్బియాలో ఇప్పటి వరకు 12వేల కరోనా కేసులు నమోదవ్వగా.. 260 మంది మరణించారు. 


Updated Date - 2020-06-22T01:47:54+05:30 IST