అమరావతి పోరాటంపై సీనియర్ న్యాయవాది 'నర్రా శ్రీనివాసరావు' వెబినార్ విజయవంతం

ABN , First Publish Date - 2020-12-07T04:25:25+05:30 IST

అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు తమకు జరిగిన అన్యాయంపై చేపట్టిన పోరాటం అవిశ్రాంతంగా కొనసాగుతోంది. న్యాయం కోసం వారు

అమరావతి పోరాటంపై సీనియర్ న్యాయవాది 'నర్రా శ్రీనివాసరావు' వెబినార్ విజయవంతం

ఇంటర్నెట్ డెస్క్: అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు తమకు జరిగిన అన్యాయంపై చేపట్టిన పోరాటం అవిశ్రాంతంగా కొనసాగుతోంది. న్యాయం కోసం వారు కోర్టుల్లో చేస్తున్న పోరాటంలోనూ సానుకూల సంకేతాలే కనిపిస్తున్నాయి. ఆ కేసులకు సంబంధించి ప్రజలను మరింత చైతన్యవంతం చేయడానికి ఎందరో కృషిచేస్తున్నారు. వారిలో ఒకరు సీనియర్ న్యాయవాది 'నర్రా శ్రీనివాసరావు'. రాజ్యాంగానికి, న్యాయస్థానానికి ఉన్న పవర్‌ను తెలుసుకుంటేనే పోరాటంలో గెలవగలం అన్నది ఆయన వివరణ. ఆ విషయాన్ని ఫ్రీ వెబినార్ ద్వారా వివరించడానికి ఆయన ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వచ్చింది. 


‘‘పోరాటం ఎంత అవగాహనతో చేస్తే అంత త్వరగా అమరావతి గెలుస్తుంది. అలా గెలవాలి అంటే న్యాయపరమైన విషయాలపై, క్షేత్రస్థాయి వాస్తవాలపై మనకు అవగాహన పట్టు ఉండాలి. పోరాటంపై పట్టుదల ఉండాలి’’ అంటూ వెబినార్‌కు హాజరైన వారికి పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. జూమ్ ద్వారా జరిగిన ఈ వెబినార్‌లో ప్రముఖ ఎన్నారైలు, అనేక మంది తెలుగు ప్రజలు పాల్గొన్నారు. అమరావతి పోరాటం గురించి అనేక క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకున్నారు.  జయరామ్ కోమటి, శేషు బాబు కానూరి, బుచ్చి రామ్ ప్రసాద్, భాను ప్రసాద్ యడ్లపాటి, సాయి, రమేష్, జానకిరామ్, మనోహర్ నాయుడు, శ్రీనివాస్, వెంకట్ తదితరులు ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. '#ఎన్నారైస్ ఫర్ అమరావతి', 'హెల్పర్స్ ఫౌండేషన్' ఈ వెబినార్ ఏర్పాటు చేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమ నిర్వహకులకు, హాజరైన వారికి, సహకరించిన వారికి, పోరాటంతో కలిసి నడుస్తున్నవారికి 'నర్రా శ్రీనివాసరావు' కృతజ్జతలు తెలిపారు.

Read more