గాలిలో 13 అడుగుల వరకు వైరస్‌

ABN , First Publish Date - 2020-04-12T08:43:24+05:30 IST

కరోనా సోకిన రోగుల నుంచి వైరస్‌ పదమూడు అడుగుల వరకు వ్యాపిస్తుందని పరిశోధకులు ఒక అధ్యయనంలో తేల్చారు. అయితే అలా వచ్చిన

గాలిలో 13 అడుగుల వరకు వైరస్‌

  • బీజింగ్‌ పరిశోధకుల వెల్లడి

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 11: కరోనా సోకిన రోగుల నుంచి వైరస్‌ పదమూడు అడుగుల వరకు వ్యాపిస్తుందని పరిశోధకులు ఒక అధ్యయనంలో తేల్చారు. అయితే అలా వచ్చిన వైరస్‌ అంత దూరంలో మరొకరికి కచ్చితంగా సోకుతుందని చెప్పలేమన్నారు. బీజింగ్‌లోని అకాడమీ ఆఫ్‌ మిలటరీ మెడికల్‌ సైన్సె్‌సకు చెందిన పరిశోధకులు వూహాన్‌లోని ఒక ఆసుపత్రిలో గల కొవిడ్‌ జనరల్‌, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు. పదమూడు అడుగులు అంటే నాలుగు మీటర్ల మేర వైరస్‌ ప్రయాణించగలదని చెప్పారు. దీని ప్రకారం వ్యక్తుల మధ్య ఇప్పుడు పాటిస్తున్న దూరాన్ని రెండింతలుగా చేసుకోవాల్సి ఉంటుంది.


యుఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌కు చెందిన ‘ఎమర్జింగ్‌ ఇన్ఫెక్షస్‌ డిసీజె్‌స’లో చైనా పరిశోధకులు ఈ వివరాలను ప్రచురించారు. వార్డుల్లోని ఫ్లోర్లపైనే వైరస్‌ కేంద్రీకృతం కావడాన్ని కూడా పరిశోధకులు గమనించారు. గురుత్వాకర్షణ అలాగే వాయు వేగాన్నిబట్టి వైరస్‌ బిందువులు వార్డుల్లోని నేలపైనే పడవచ్చని పేర్కొన్నారు. రోగి చుట్టుపక్కల అంటే బెడ్‌కు ఉండే ఇనుపకమ్మీలు, ఉమ్మితొట్టెపై భాగం, తలుపు గడియపై వైరస్‌ ప్రభావం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఐసియు సిబ్బంది బూట్లపై పడిన బిందువులు పాజిటివ్‌గా తేలాయి. దీంతో వైద్య సిబ్బంది ధరించే షూ సోల్‌ వైర్‌సను వ్యాప్తి చేసే అవకాశం ఉందని తేలింది. గాలి తుంపర్లతో వైరస్‌ పదమూడు అడుగులు వెళుతుందని ఎనిమిది అడుగుల మేర కొద్ది మొత్తంలో కనుగొనవచ్చని తెలిపారు. అయితే, సరైన జాగ్రత్తలు పాటిస్తున్నందున, ఆసుపత్రి సిబ్బందిలో ఎవరికీ వైరస్‌ సోకలేదు. వైరస్‌ ఈ పద్ధతిలోనే వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున బయటకు వచ్చేటప్పుడు ప్రజలు మాస్క్‌ ధరించడమే మంచిదని అమెరికా అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 


Updated Date - 2020-04-12T08:43:24+05:30 IST