ఇంగ్లండ్‌లో చరిత్ర పూర్వ చిహ్నాలు లభ్యం
ABN , First Publish Date - 2020-06-23T14:23:35+05:30 IST
ఇంగ్లండ్‌లోని స్టోన్‌హెంజ్ సమీపంలో చరిత్ర పూర్వ యుగానికి చెందిన స్మారక చిహ్నాలను కనుగొన్నట్లు బ్రాడ్‌ఫోర్ట్ యూనివర్సిటీ పురావస్తు

లండన్, జూన్ 22: ఇంగ్లండ్‌లోని స్టోన్‌హెంజ్ సమీపంలో చరిత్ర పూర్వ యుగానికి చెందిన స్మారక చిహ్నాలను కనుగొన్నట్లు బ్రాడ్‌ఫోర్ట్ యూనివర్సిటీ పురావస్తు శాస్త్రవేత్తలు సోమవారం తెలిపారు. స్టోన్‌హెంజ్‌లోని ప్రసిద్ధి చెందిన వృత్తాకారంలో ఉండే రాతి నిర్మాణాలను (మిస్టికల్ స్టోన్ సర్కిల్) మరింత అధ్యయనం చేయడానికి ఈ చిహ్నాలు ఉపయోగపడతాయని వారు తెలిపారు. వీటిని 4500 సంవత్సరాల క్రితం వాటిగా భావిస్తున్నారు. స్టోన్‌హెంజ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని నియోలిథిక్ గ్రామం డురింగ్టన్ వాల్ హెంజ్ వద్ద జరిపిన తవ్వకాల్లో ఈ 20 స్మారక చిహ్నాలు లభించాయి.