కరోనా వ్యాప్తిలో సూక్ష్మ తుంపర్లు
ABN , First Publish Date - 2020-10-07T09:30:52+05:30 IST
: కరోనావ్యాప్తిలో ఏరోసాల్స్ మరింత ప్రమాదమనే విషయం ప్రజలకు చెప్పాలని

లాస్‌వెగాస్,అక్టోబరు 6: కరోనావ్యాప్తిలో ఏరోసాల్స్ మరింత ప్రమాదమనే విషయం ప్రజలకు చెప్పాలని సైన్సు సమాజాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా, మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కోరారు. కరోనా వ్యాప్తిలో దగ్గు లేదా తుమ్ము వల్ల వెలువడే పెద్ద తుంపర్ల(డ్రా్‌పలెట్స్) గురించే కాకుండా అతి సూక్ష్మ తుంపర్ల(ఏరోసాల్స్) గురించి అవగాహన కల్పించాలంటూ బహిరంగ లేఖను విడుదల చేశారు.
పెద్ద తుంపర్లు ఎక్కువ దూరం ప్రయాణించవు. 100 మైక్రాన్ల కంటే తక్కువ బరువుండే అతి సూక్ష్మ తుంప ర్లు మాత్రం వైర్‌సను ఎక్కువ దూరం మోసుకెళ్తాయి. వాటిలో వైరస్ ఎక్కువసేపు సజీవంగా ఉంటుంది. వెంటిలేషన్ సరిగా లేని ప్రాంతంల్లో ఏరోసాల్స్ పేరుకుపోతాయి. తద్వారా ఎక్కువ మందికి కరోనా సోకడానికి కారణమవుతాయి.