భారత్ సహా పలు దేశాలకు విమాన సర్వీసులు నిలిపివేసిన సౌదీ

ABN , First Publish Date - 2020-03-13T15:43:42+05:30 IST

రోజురోజుకీ వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్(కొవిడ్-19) ధాటికి గల్ఫ్ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి.

భారత్ సహా పలు దేశాలకు విమాన సర్వీసులు నిలిపివేసిన సౌదీ

సౌదీ: రోజురోజుకీ వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్(కొవిడ్-19) ధాటికి గల్ఫ్ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఈ మహమ్మారిని అరికట్టే క్రమంలో ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే కువైట్ సహా ఇతర దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా సౌదీ సర్కార్ కూడా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు పలు దేశాలకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గురువారం సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేగాక సౌదీ పౌరులతో పాటు దేశంలో నివశిస్తున్న ఇతర దేశాలకు చెందిన వారు సైతం కొన్ని రోజులు బయటి దేశాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించింది.


సౌదీ విమాన సర్వీసులు రద్దు చేసిన దేశాల జాబితాలో యూరోపియన్ యూనియన్, స్వీట్జర్లాండ్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఫిలిప్పీన్స్, సుడాన్, ఈథియోపియా, సౌత్ సుడాన్, ఎరిట్రియా, కెన్యా, జిబౌటి, సోమాలియా ఉన్నాయి. అలాగే ఈ దేశాల నుంచి వచ్చే వారిపై కూడా నిషేధం విధించింది.  


Updated Date - 2020-03-13T15:43:42+05:30 IST