సౌదీలో మహమ్మారి స్వైర విహారం.. ఒక్కరోజే..
ABN , First Publish Date - 2020-06-17T01:20:02+05:30 IST
గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది.

రియాధ్: గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. సౌదీలో కోవిడ్-19 కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. మంగళవారం కూడా 4,267 కొత్త కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకూ సౌదీలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 136,315కు చేరింది. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో అధికంగా రియాధ్ (1,629), జెడ్డా (477), మక్కా (224), హఫౌఫ్ (200) తదితర ప్రాంతాల్లో నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే 1,650 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఈ వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 89,540కు చేరింది. ఇక ఇవాళ సంభవించిన 41 మరణాలతో కలిపి ఆ దేశంలో ఈ మహమ్మారికి బలైనవారు 1,052 మంది అయ్యారు. కాగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 1,910 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇదిలాఉంటే... ప్రపంచ దేశాలను అతలాకుతలం ఈ వైరస్ ఇప్పటికే 4.30 లక్షలకు పైగా మందిని బలిగొంది. 81 లక్షల మంది బాధితులు ఉన్నారు.