ఫైజర్ వ్యాక్సిన్ కోసం సౌదీ అరేబియా రిజిస్ట్రేషన్ !

ABN , First Publish Date - 2020-12-11T14:07:06+05:30 IST

సౌదీ అరేబియాలోని ఆరోగ్య శాఖ అధికారులు దేశంలో దిగుమతి, వినియోగం కోసం ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా గురువారం వెల్లడించింది.

ఫైజర్ వ్యాక్సిన్ కోసం సౌదీ అరేబియా రిజిస్ట్రేషన్ !

రియాధ్: సౌదీ అరేబియాలోని ఆరోగ్య శాఖ అధికారులు దేశంలో దిగుమతి, వినియోగం కోసం ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా గురువారం వెల్లడించింది. నవంబర్ 24న ఫైజర్ వెల్లడించిన డేటా ప్రకారం సౌదీ హెల్త్ అధికారులు దేశంలో వ్యాక్సిన్ దిగుమతి, వినియోగం కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు ఎస్‌ఎఫ్‌డీఏ వెల్లడించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ తన ప్రకటనలో పేర్కొంది. ఇంపోర్ట్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ పూర్తైన తరువాత టీకా వచ్చిన తేదీని, దానికి సంబంధించిన ఇతర వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుందని సమాచారం. ఇక ప్రపంచంలోనే బ్రిటన్ తర్వాత ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన రెండో దేశంగా గల్ఫ్ దేశమైన బహ్రెయిన్ నిలిచిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-12-11T14:07:06+05:30 IST