సౌదీలో ప్రారంభం కానున్న రెండు కొత్త విమానాశ్రయాలు...
ABN , First Publish Date - 2020-05-29T18:10:03+05:30 IST
సౌదీ అరేబియాలో మే 31న రెండు కొత్త విమానాశ్రయాలు ప్రారంభం కానున్నాయి.

రియాధ్: సౌదీ అరేబియాలో మే 31న రెండు కొత్త విమానాశ్రయాలు ప్రారంభం కానున్నాయి. జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్(జీఏసీఏ)... అల్ జౌఫ్, ఆర్ ఆర్లలో ఈ రెండు జాతీయ ఎయిర్పోర్టులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు కొత్త విమానాశ్రయాలతో కలిపి సౌదీలో మొత్తం డొమెస్టిక్ ఎయిర్పోర్టుల సంఖ్య 13కి చేరనుంది. రియాధ్, జెడ్డా, దమ్మామ్, మదీనా, అల్ కాశీమ్, అభా, తుబుక్, జజాన్ హయిల్, అల్ బహా, నజ్రాన్లలో మిగతా 11 డొమెస్టిక్ విమానాశ్రయాలు ఉన్నాయి. కాగా, కరోనా లాక్డౌన్ వల్ల ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సౌదీ సర్కార్ ఈ ఆదివారం(మే 31న) నుంచి దేశీయ విమాన సర్వీసులను నడిపేందుకు సౌదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.