సౌదీ నుంచి వచ్చి భారత్‌లో చిక్కుకున్న ప్రవాసులకు గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2020-09-15T04:34:26+05:30 IST

సౌదీ నుంచి భారత్‌కు వచ్చి ఇక్కడే చిక్కుకున్న ప్రవాస భారతీయులకు సౌదీ

సౌదీ నుంచి వచ్చి భారత్‌లో చిక్కుకున్న ప్రవాసులకు గుడ్‌న్యూస్

మంగళూరు: సౌదీ నుంచి భారత్‌కు వచ్చి ఇక్కడే చిక్కుకున్న ప్రవాస భారతీయులకు సౌదీ అంబాసడర్ డాక్టర్ సాద్ మహమ్మద్ గుడ్‌న్యూస్ చెప్పారు. అత్యవసర ఉద్యోగులు తిరిగి సౌదీకి ప్రత్యేక విమానాల ద్వారా వెళ్లే అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు. సాద్ మహమ్మద్‌తో ఎన్నారై ఫోరమ్ ఆఫ్ కర్ణాటక మాజీ డిప్యూటీ చైర్ పర్సన్ అరతీ కృష్ణా సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొవిడ్-19, ఎంప్లాయిమెంట్, ఎయిర్ బబూల్ గురించి సాద్ మహమ్మద్‌తో అరతీ చర్చించారు. సౌదీ నుంచి వచ్చి చిక్కుకున్న ప్రవాసులు తిరిగి సౌదీ వెళ్లేందుకు నవంబర్ వరకు వేచి ఉండాలని అరతీ అన్నారు. 


ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు భారత్ నుంచి సౌదీ వెళ్లేందుకు ఇప్పటికే అనుమతులున్నాయని ఆమె గుర్తుచేశారు. అయితే ఇప్పుడు సౌదీ కంపెనీలు అత్యవసర ఉద్యోగులను తిరిగి సౌదీకి తీసుకువెళ్లేలా కొత్త అనుమతులు ఇవ్వనున్నట్టు సాద్ మహమ్మద్ చెప్పారని అరతీ తెలిపారు. ఒకవేళ సౌదీ కంపెనీలు తమ అత్యవసర ఉద్యోగులను(భారతీయులు) సౌదీకి తీసుకువెళ్లాలనుకుంటే.. సౌదీ విదేశాంగశాఖను సంప్రదించాలని సాద్ మహమ్మద్ అన్నారు. విదేశాంగశాఖను సంప్రదించి సౌదీ ఎంబసీ ద్వారా ప్రత్యేక విమానాల్లో భారతీయులను సౌదీకి తీసుకువెళ్లేలా అనుమతులిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Updated Date - 2020-09-15T04:34:26+05:30 IST